HYD: నగరాన్ని కుదిపేసిన దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు నేటితో 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ ఘోర ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘటనాస్థలికి చేరుకుని మృతులకు పుష్పాంజలి ఘటించారు.