KMM: ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు బుధవారం తెల్లవారుజాము నుంచి 2,000 మంది కార్మికులు విధులకు దూరంగా ఉండనున్నారు. ఫలితంగా ఖమ్మం జిల్లాలోని 7 డిపోల పరిధిలో 608 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిత్యం ప్రయాణించే సుమారు లక్ష మందికిపైగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.