MHBD: గార్ల మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఎస్సై సాయికుమార్ నేతృత్వంలో ముల్కనూర్ చౌరస్తా, సత్యనారాయణపురం క్రాస్ రోడ్, సీతంపేట తదితర ప్రాంతాల్లో ప్రమాద సూచిక బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ట్రాఫిక్ బారికేడ్లను ఉంచారు. ప్రధాన కూడళ్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.