MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను బుధవారం కాయకల్ప అవార్డు బృందం సందర్శించారు. డాక్టర్ విజయ శంకర్ ఆధ్వర్యంలోని బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఆస్పత్రిలో మౌలిక వసతులు, మందుల నిలువలు, శుభ్రత, శానిటేషన్, ప్లాంటేషన్, పరిసరాల పరిశుభ్రతను వారు పరిశీలించారు.