ASF: ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు శ్రద్ధగా విన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కారం చేయాలని సూచించారు.