NRPT: రాంపూర్ గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహ ప్రతిష్టాపనకు అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు దండు అయ్యప్ప రూ.1,40,000 నగదు అందజేశారు. విగ్రహ తయారీ ఖర్చు భరిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఆయన ఈ మొత్తాన్ని వడ్డెర సంఘం సభ్యులకు అందజేశారు. ఆయన సేవా భావాన్ని గ్రామస్థులు, నాయకులు అభినందించారు.