SRPT: పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టం-2025ను కేంద్రం తక్షణమే రద్దు చేయాలంటూ.. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు పెన్షనర్లు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ పెన్షన్ విధానంతో తీవ్ర నష్టం కలుగుతుందని పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షుడు సంతోష్ అన్నారు. అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.