MNCL: గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీరాంపూర్ SI సంతోష్ కోరారు. మంగళవారం నార్కోటిక్ టీమ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్, పోలీసు సిబ్బంది కలిసి బస్టాండ్ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలం, ఆటో స్టాండ్, సమీపంలోని హోటళ్లు, పాన్ షాపులు తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.