NGKL: బిజినేపల్లి ప్రధాన రహదారిపై వెలుగొండ గేటు వద్ద రహదారి పరిస్థితి దయనీయంగా మారింది. వంతెనపై ఏర్పడిన గుంతలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కనీస హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో, అటుగా వెళ్లేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో అధికారులు తూతూమంత్రంగా పనులు చేయకుండా, శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.