AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా అల్లూరి, పోలవరం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.