SDPT: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు టీ పొడితో తెలంగాణ పటాన్ని అద్భుతంగా చిత్రించారు. నాలుగు కోట్ల ప్రజల ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని కొనియాడారు. మన భాష, యాసను స్మరిస్తూ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.