NRPT: నర్వ మండలం లక్కర్ దొడ్డి గ్రామ రహదారి పక్కన ఉపాధి హామీ పథకం కింద నాటిన మొక్కలు రక్షణ లేక మంటల్లో కాలిపోతున్నాయని గ్రామస్థులు తెలిపారు. మొక్కల చుట్టూ భద్రతా చర్యలు లేకపోవడంతో అజాగ్రత్తగా వేసే మంటలు వాటిని దహనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.