MLG: ములుగు మండలం ఇంచెర్ల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనులకు శనివారం రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జిల్లా కాంగ్రెస్ నేతలు, DRDO తదితరులు పాల్గొన్నారు.