KMM: చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ భవనాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని సర్పంచ్ తాళ్లూరి స్వప్న ప్రారంభించారు. పాఠశాల పరిసరాలను శుభ్రపరిచి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామాల్లోని పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ సమస్యలకు ఈ 99 రోజుల్లో పరిష్కారం లభిస్తుందని అన్నారు.