గట్టు మండలం మిట్టదొడ్డి శివారులోని శివాలయంలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. వేద పండితులు ఇప్పటికే ఆలయానికి చేరుకుని జలాధివాసం, ధాన్యాధివాసం తదితర పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈనెల 8 నుంచి 13 వరకు శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదానం చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.