KRNL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదోని రెవెన్యూ భవన్లో ఐద్వా ఇవాళ మహిళా చైతన్య సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్యామల పాల్గొని మహిళలు చైతన్యంతో ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసి, వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు.