NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల స్థానిక కౌన్సిలర్ ఎజాస్తో కలిసి శనివారం పరిశీలించారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.