తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన్లకు రిజర్వేషన్లు అందిస్తామంటూ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన జీవోని కేవలం వారం రోజుల్లో విడుదల చేస్తామని ఆయన చెప్పడం గమనార్హం. బంజారాహిల్స్ లో ఈరోజు బంజారా భవన్ ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజ్లకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ప్రకటించించడం విశేషం.
ఆదివాసీ బంజారా జంట భవనాలవద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వందలాదిమంది గిరిజన కళాకారులు గోండు, బంజారా సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఆదివాసీ భవన్ కు చేరుకున్న సీఎం అక్కడ సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేశారు. అనంతరం ఆదీవాసీ భవనాన్ని ఆవిష్కరించారు.
బంజార భవన్ ను ప్రారంభించటం అంటే ఇవాళ భారతదేశ గిరిజన జాతి బిడ్డలకు స్ఫూర్తిని కలిగించే సందర్భమన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని బంజారా బిడ్డల గౌరవం తెలిసేలా నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. భవనాన్ని ప్రారంభించటం సంతోషంగా ఉందన్న ఆయన… గిరిజన జాతి నుంచి పైకెదిగిన ఉద్యోగులు నాయకులు మేధావులకు వారి భవిష్యత్తు తరాలను ముందు వరసలో నడిపే బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.‘‘ కేవలం భవనాలను నిర్మించుకోవడమే కాదు. వాటిని సద్వినియోగం చేసుకునే దిశంగా గిరిజన మేధావి వర్గం ఉద్యోగులు ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్ర నీటిపారుదలశాఖలో పనిచేసే హరిరామ్ లాంటి అనేకమంది బంజారా బిడ్డలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములై తమ సేవలందిస్తున్నారు. వారికి నా అభినందనలు.” అని తెలిపారు.