NLG: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సవ్యంగా నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా, జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్స్, దోమలపల్లి ZPHS, మునుగోడులోని ZPHSలోని పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు.