SRD: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖేడ్‌కు చెందిన చిత్రకారుడు గుండు శివ కుమార్ రావి ఆకు పై మాతృమూర్తి చిత్రాన్ని వేశాడు. సృష్టికి మూలమైన మహిళ శక్తిని గుర్తించేలా ఆకుపై తల్లి బిడ్డ చిత్రాన్ని వేసి చిత్ర కళా నైపుణ్యతను చాటాడు. ఈ సందర్భంగా మహిళా మణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శివకుమార్ ప్రతిభపై పలువురు ప్రశంసించారు.