MHBD: కేసముద్రం స్టేషన్ గ్రామ పంచాయతీ తొలి సర్పంచ్ తాటికొండ పుల్లయ్య (90) మంగళవారం కన్నుమూశారు. 1980లో కేసముద్రం గ్రామాన్ని విలేజ్, స్టేషన్ గ్రామ పంచాయతీలుగా విభజించిన అనంతరం స్టేషన్ గ్రామ పంచాయతీకి తొలి సర్పంచ్‌గా ఆయన ఎన్నికయ్యారు. పుల్లయ్య మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.