JN: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నేషనల్ హైవేస్ అంబులెన్స్ ను జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ అంబులెన్స్ ద్వారా జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణమే అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. వీటి సేవలు యాదాద్రి – వరంగల్ NH – 163 లో కొనసాగుతాయని తెలిపారు.