VKB: బొంరాస్పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు.