WGL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం వరంగల్ నగరంలో ఈట్ రైట్ వాక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్య శారద జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆహార భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.అనంతరం హెడ్ పోస్టాఫీస్ వద్ద మానవహారం నిర్వహించి,కల్తీలేని ఆహారం తీసుకుంటూ ఆరోగ్యసమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.