MNCL: జన్నారం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసేలా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకే ప్రచారం నిర్వహిస్తున్నామని నియోజకవర్గ సాధన కమిటీ నాయకులు అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని దేవునిగూడెం తదితర గ్రామాల్లో వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో సమావేశం నిర్వహించారు. అటవీ ఆంక్షలతో జన్నారం మండలం పూర్తిగా వెనుకబడిందని ఆందోళన వ్యక్తం చేశారు.