JGL: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల ఇందిరా భవన్ నుంచి కలెక్టరేట్ వరకు రైతులతో ర్యాలీగా వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారన్నారు. కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.