MLG: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం జిల్లాకు చెందిన 25 మంది యువతీ యువకులకు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలో జిల్లాలో ప్రైవేట్, బహుళజాతి కంపెనీల సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.