WGL: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని DIEO డా. శ్రీధర్ సుమన్ అన్నారు. DIEO ఆఫీసు నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో గూగుల్ మీట్ ద్వారా DIEO సమీక్ష నిర్వహించారు. ఈనెల 20వ తేదీ లోపు సప్లమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించడానికి ప్రిన్సిపాళ్లు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.