MDCL: అల్వాల్ పరిధిలోని ఆల్వాల్ హిల్స్, సిటిజన్ కాలనీ, ఓల్డ్ ఆల్వాల్, మచ్చ బొల్లారం ప్రాంతాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఇంటిలో చాలీసా పఠించడం వల్ల ధైర్యం, దైవభక్తి పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.