WGL: నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక నాయకులతో కలసి, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.