SKLM: మాజీ డీజీపీ హెచ్. జే. దొర మృతి రాష్ట్రానికి, జిల్లాకి తీరని లోటని వైసీపీ టెక్కలి నియోజకవర్గం ఇంఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. టెక్కలి వైసీపీ కార్యాలయంలో శనివారం దొర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.