AP: ఆకివీడులోని పురాతన రామాలయ పునర్నిర్మాణంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు స్పందించారు. ఆలయ క్లీనింగ్‌ను కొందరు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాములవారి విగ్రహాలు ఉన్న చోట ఆలయ అభివృద్ధి జరగాల్సిందేనని, వారికేంటి సమస్య అని ప్రశ్నించారు. టీటీడీ సహకారంతో ఈ ఆలయాన్ని తప్పకుండా నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.