TPT: గూడూరు పట్టణంలోని మధురెడ్డి ఎస్టీ కాలనీలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 నిరుపేద కుటుంబాలకు శనివారం అన్నదానం నిర్వహించారు. చిల్లకూరులోని అమృత విలాస్ అధినేత సుద్దరాసి పెంచలయ్య, మాధవి దంపతుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి కంటి వైద్యురాలు డాక్టర్ హెలిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.