VZM: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భోగాపురంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి జనసేన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అధికారం కోసం కాకుండా ప్రజల కోసం నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆమె పేర్కొన్నారు.