VSP: ఉగాది పండుగను పురస్కరించుకుని ఏఎన్ బీచ్ హాస్పిటల్ అధినేత, వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జహీర్ అహ్మద్ ఆధ్వర్యంలో శనివారం 39వ వార్డులోని వివేకానంద సంస్థలో పారిశుధ్య కార్మికులు, వృద్ధులు, పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.