SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 33వ వార్డులో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేసినందుకు వార్డు కౌన్సిలర్ కొండ వర్షినితోపాటు వార్డు ఆఫీసర్, బిల్ కలెక్టర్‌ను మున్సిపల్ పాలకవర్గం సత్కరించింది. ఆదివారం సిరిసిల్ల పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు జిందం కళ-చక్రపాణి, వైస్ ఛైర్మన్ దార్ల సందీప్, కమిషనర్ పాల్గొన్నారు.