NZB: సిరికొండ, మాచారెడ్డి, సిరిసిల్ల సరిహద్దుల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆర్మూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ భవానీ శంకర్ గురువారం తెలిపారు. అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రివేళ పొలాల వద్ద కరెంట్ వైర్లు పెట్టవద్దని హెచ్చరించారు.