KNR: కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో ‘సాక్షం’ అంగన్వాడీ కేంద్రంలో వాటర్ ప్యూరిఫైర్ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లాలోని 269 కేంద్రాల్లో ఒక్కోదానికి రూ.లక్షతో టీవీలు, పోషణ వాటికలు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల హాజరు శాతం పెంచాలని కోరుతూ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు.