మెదక్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా చేగుంట మండలానికి చెందిన బుడ్డ భాగ్య రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భాగ్యరాజు పేర్కొన్నారు.