KMR: జిల్లాలో మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే శ్రమశక్తి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కార్మిక సహాయ కమిషనర్ కమర్ తెలిపారు. అర్హులైన కార్మిక నాయకులు, విశిష్ట సేవలు అందించిన యజమానులు ఈ నెల 15వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని ఆయన కోరారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అవార్డులకు తుది ఎంపిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.