MHBD: తొర్రూరు పట్టణ సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం 10వ వార్డులో స్థానిక కౌన్సిలర్ సురేష్, కమీషనర్ శ్యామ్ సుందర్‌లతో కలిసి పర్యాటించారు. వార్డులోని సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. పట్టణంలోని సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.