ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పై బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను తాను సమర్థించను అని ఎంపీ అరవింద్(MP Arvind) అన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలని హితవు పలికారు. బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు, అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అని అరవింద్ వెల్లడించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పై బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను తాను సమర్థించను అని ఎంపీ అరవింద్(MP Arvind) అన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలని హితవు పలికారు. బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు, అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అని అరవింద్ వెల్లడించారు. కవిత ఈడీ ఆఫీసులో ఉంటే, తెలంగాణ క్యాబినెట్ అంతా ఢిల్లీలో మకాం వేసిందని ఎంపీ అరవింద్ విమర్శించారు. ఇదే చిత్తశుద్ది ప్రజల అభివృద్ధిపై ఉంటే రాష్ట్రం బాగుపడేదన్నారు.
దర్యాప్తునకు కవిత సహకరించలేదని తెలిసిందన్నారు. ఎందుకు? ఏమిటి? ఎలా? అని ఈడీ (ED) అధికారులు అడిగితే.. ఏమో, తెలవదు, గుర్తులేదు అని కవిత సమాధానం చెప్పినట్టు ఆయన ఆరోపించారు. కవిత చేతికి రూ.20లక్షల గడియారం, కోట్ల రూపాయల నగలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసు అన్నారు అరవింద్. అవినీతిని అంతం చేయాలని ప్రధాని మోదీ (PM MODI) కంకణం కట్టుకున్నారని ఆయన చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో మునిగితేలారు. మీ వల్లే జెంటిల్మెన్ మాగుంట ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడింది. పెద్ద సంస్థ అరబిందో సైతం ఇబ్బందుల్లో ఉంది. రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం అంటరాని కుటుంబం” అని ఎంపీ అరవింద్ అన్నారు.