MLG: వెంకటాపురం మండలంలో మంగళవారం కురిసిన గాలివానతో కూడిన భారీ వర్షం నష్టం మిగిల్చింది. ఆలుబాక గ్రామం సమీపంలో పిడుగుపడటంతో మద్ది వెంకటేశ్వర్లుకు చెందిన 35 మేకలు మృతి చెందగా, సురవీడు పంచాయతీ కే.కొండాపురం గ్రామంలో మరో మూడు ఆవులు చనిపోయాయి. మృతిచెందిన పశువుల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని, ఘటనలో ఓ మహిళ స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.