Bandi Sanjay - Etela : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ లు ఢిల్లీ కి మకాం మర్చారు. అధిష్టానం నుండి పిలుపు రావడం తో వీరు బుధువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ లు ఢిల్లీ కి మకాం మర్చారు. అధిష్టానం నుండి పిలుపు రావడం తో వీరు బుధువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.
ఈ క్రమంలో పార్టీలోకి చేరికలను వేగవంతం చేయడం.. జనం సమస్యలపై పోరాడటం వంటి వాటిపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో లో ఉన్న అసంతృప్తులను పార్టీలో చేర్చుకుని బీజేపీని బలోపేతం చేయాలనే దిశగా చర్యలు చేపడుతున్నది.
అందుకే అధిష్టానం బండి సంజయ్ ని ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనలకు అమిత్ షా, జేపీ నడ్డా వచ్చిన సందర్భంలోనూ చేరికలపై ఆరా తీశారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని, చేరికలను ప్రోత్సహించాలని రాష్ట్ర నేతలకు అమిత్ షా, నడ్డా దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ బలోపేతంపై జాతీయ నేతలతో చర్చించినట్లు సంజయ్ తెలిపారు. అక్రమ అరెస్ట్ గురించి అడిగి తెలుసుకున్నారన్నారు. కేసీఆర్ అరాచకాలన్నీ పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు.