JGL: శిక్షణలో నేర్చుకున్న అంశాలతో గ్రామీణ అభివృద్ధికి ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎంసీహెచ్ఐర్డీ హైదరాబాద్‌లో 6 వారాల శిక్షణ పూర్తి చేసిన ఎంపీడీవోలు కలెక్టరేట్లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శిక్షణలో పొందిన జ్ఞానం, అనుభవాలను గ్రామ స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి సమస్యలను పరిష్కరించాలన్నారు.