SRD: సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూన్ నెల యుడీఐడీ (సదరం) శిబిరాలు 3, 10, 17, 24 తేదీల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తెలిపారు. యుడీఐడీ పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని, ఫోన్ లేదా మెసేజ్ ద్వారా సమాచారం అందినవారే హాజరు కావాలన్నారు. ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ ఫోటో, సంబంధిత వైద్య నివేదికలు తీసుకురావాలన్నారు.