GDWL: గద్వాల్ నుంచి ఆత్మకూరు వెళ్లే ప్రధాన రహదారి ప్రయాణికులకు చుక్కలు చూపుతోంది. దెబ్బతిన్న రోడ్డుకు తాత్కాలికంగా మట్టి వేసి చేతులు దులుపుకోవడంతో వాహనదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో, మట్టి కొట్టుకుపోయి గుంతలు మళ్లీ పెద్దవిగా తయారయ్యాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.