HYD: మల్కాజ్‌గిరికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ లింకు వచ్చింది. ‘రూ. 40కే అమ్మాయితో లైవ్ వీడియో కాల్ మాట్లాడొచ్చని, ఇందుకోసం లింకు క్లిక్ చేయండి’ అని మెసేజ్ సారాంశం. టెంప్ట్ అయిన అతడు పర్యవసానాలు ఆలోచించకుండా క్లిక్ చేశాడు. అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసి, వెంటనే కట్ చేసింది. అర్థంకాని అతడు ఆలోచనలో ఉండగా అకౌంట్లో ఉన్న రూ. 8,457 కట్ అయింది.