WGL: సోమవారం నిర్వహించిన పదో తరగతి సోషల్ పబ్లిక్ పరీక్షకు 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారి రంగ నాయుడు తెలిపారు. మొత్తం 9,492 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, కొద్దిమంది మాత్రమే గైర్హాజరు కావడం గమనార్హమని పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడినట్లు అధికారులు వెల్లడించారు.