WGL: ఆశ వర్కర్ల పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని BRTU ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా వైద్య కార్యాలయం సూపర్డెంట్కి వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ నాయకుడు యువరాజ్ మాట్లాడుతూ.. ప్రతి నెల ఒకటో తారీకు జీతం అందిస్తామని ప్రభుత్వం చెప్పి ఇప్పటి వరకు వేతనాలు అందించడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరారు.